మౌనాన్ని బలహీనత అనుకోవద్దు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-01 03:28:00

-నిరాధార ఆరోపణలపై అనుష్కశర్మ ఆగ్రహం
img
న్యూఢిల్లీ: అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే తాను ఇంతకాలం మౌనంగా ఉన్నానని, అయితే తన మౌనాన్ని బలహీనత అనుకుంటున్నందునే బదులివ్వాల్సి వచ్చిందని బాలీవుడ్ నటి, టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్ సమయంలో ఓ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీలోని ఓ సభ్యుడు అనుష్కకు టీ అందించారని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, 82ఏండ్ల ఫరూక్ ఇంజినీర్ చెప్పారు. అలాగే సెలెక్టర్ల అర్హతలు, అంతర్జాతీయ అనుభవంపైనా విమర్శలు చేశారు. అయితే ఈ విషయంలో తనపేరును వాడడంపై అనుష్క శర్మ స్పందించింది. ఆ వ్యాఖ్యలు దురుద్దేశ పూరిత అబద్ధాలని, సంచలనాల కోసం తన పేరును ఏ విషయంలోనూ లాగొద్దని చెప్పింది. ప్రపంచకప్ సమయంలో నాకు ఓ సెలెక్టర్ టీ అందించారని దురుద్దేశంతో కూడిన అబద్ధం కొత్తగా బయటకు వచ్చింది. నేను వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌కు వచ్చా. ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చున్నా, సెలెక్టర్ల బాక్స్‌లో కాదు. మీ సదుపాయం కన్నా నిజమే ముఖ్యం. సెలెక్షన్ కమిటీపై, సెలెక్టర్ల అర్హతల గురించి ప్రశ్నించదలచుకుంటే నేరుగా విమర్శించండి. మీ అభిప్రాయం సంచలనం అయ్యేందుకు అనవసరంగా నా పేరును లాగొద్దు. ఇలాంటి విషయాల్లో నా పేరు వచ్చేందుకు నేను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించను అని అనుష్క ట్విట్టర్‌లో బహిరంగ లేఖ ద్వారా చెప్పింది. అలాగే గతంలో విరాట్ కోహ్లీ ప్రదర్శన, విదేశీ పర్యటనలు, భారత క్రికెట్‌లో జోక్యం విషయాల్లో ఏ సంబంధం లేకున్నా విమర్శలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఫరూక్ ఇంజినీర్ వ్యాఖ్యలను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపాడేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD