యశస్వి రికార్డ్‌ ‘డబుల్‌’

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 06:02:22

న్యూఢిల్లీ: లిస్ట్‌-ఎ (దేశవాళీ) 50 ఓవర్ల క్రికెట్‌లో పిన్న వయస్సులో ద్విశతకం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు యశస్వీ జైస్వాల్‌. బుధవారం విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఎడమ చేతివాటం ముంబై బ్యాట్స్‌మన్‌ 154 బంతుల్లో 203 (12 సిక్సర్లు, 17 ఫోర్లు) పరుగులు చేశాడు. ప్రపంచ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు చిన్న వయస్సులో డబుల్‌ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్‌ బారో పేరిట ఉండేది. అతడు 1975లో 20 ఏళ్ల 273 రోజుల వయస్సులో నెలకొల్పిన రికార్డును యశస్వి 17 ఏళ్ల 292 రోజుల్లోనే ద్విశతకం సాధించి తిరగరాశాడు. మొత్తంగా భారత దేశవాళీ క్రికెట్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఏడో ఆటగాడిగా అతడు నిలిచాడు. యశస్వికి ఇదే తొలి విజయ్‌ హజారే ట్రోఫీ కావడం విశేషం. ఈ టోర్నీలో కేరళ (113), గోవా (122)పై సెంచరీలు నమోదు చేసిన యశస్వి తన ఫామ్‌ను కొనసాగిస్తూ జార్ఖండ్‌పై డబుల్‌ టన్‌ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై యశస్వి భారీ ఇన్నింగ్స్‌తో 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఛేదనలో జార్ఖండ్‌ 46.4 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD