యువరాజ్‌ను ట్రోల్ చేసిన సానియా మీర్జా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-29 21:00:49

img

టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను.. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఘోరంగా ట్రోల్‌ చేసింది. సోషల్‌‌మీడియా యువీ కానీ, సానియా కానీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తమ వ్యక్తిగత జీవితంకు సంబంధించిన అంశాలను వాళ్లు తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా యువీ మీసం, గడ్డం పూర్తిగా షేవ్ చేసిన వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నాడు. ‘‘కొత్త చికినా చెమెలా లుక్!! లేక పాత గడ్డం లుక్‌లోకి వచ్చేయనా!!’’ అంటూ ఈ పిక్‌కి యువరాజ్ క్యాప్షన్ పెట్టాడు.

అయితే ఈ పిక్ చూసిన సానియా.. యువీపై సెటైర్ వేసింది. ‘‘నీ చిన్ కనిపించకకుండా ఉండాలని నువ్వు బాతులా మూతి పెట్టావా? మళ్లీ గడ్డం లుక్‌లోకి రా’’ అంటూ సానియా కామెంట్ చేసింది. అయితే యువీ అభిమానులు మాత్రం ఈ కొత్త లుక్‌ని మెచ్చుకుంటున్నారు. ‘‘ఈ లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నావ్ యువీ’’ అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేయగా.. ‘‘క్లీన్ షేవ్‌లో చాలా బాగున్నావ్ యువీ పాజీ’’ అంటూ మరొకరు పేర్కొన్నారు. ‘‘క్లీన్ షేవ్ అయినా.. గడ్డం లుక్ అయినా నీకు సూట్ అవుతుంది’’ అని ఇంకొంకరు కామెంట్ చేశారు.

ఇటీవల టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గురించి కామెంట్ చేసి యువరాజ్ వార్తల్లో నిలిచాడు. రిషబ్ పంత్ ఫాంపై వస్తున్న విమర్శలను యువీ ఖండించాడు. ‘‘పంత్‌ని అర్థం చేసుకొనే వ్యక్తి అతనికి అవసరం. అతనిపై ఒత్తిడి తేవడంవల్ల మంచి ఫలితాలు బయటకు రావు. అతనికి సత్తా ఉంది, కెప్టెన్.. కోచ్‌లు అతన్ని ప్రోత్సాహించాలి. రిషబ్ గురించి మీడియాతో జట్టు సభ్యులు ఎంత తక్కువ మాట్లాడితే.. అంత మంచింది’’ అని యువీ అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN