రంగారెడ్డి జిల్లా గెలుపు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-03 04:11:38

హైదరాబాద్ : స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో మహత్మాగాంధీ జూనియర్ స్టేట్ క్రికెట్ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-మల్కజిగిరి, కాంబైండ్ జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. స్కూల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫేడరేషన్ (ఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్ పాతబస్తీ కులికుతుబ్‌షా అర్భన్ డెవలమెంట్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఎస్‌ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌లో ప్రారంభ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా జట్టు 44 పరుగుల తేడాతో ప్రత్యర్థి మేడ్చల్-మల్కజిగిరి జిల్లా జట్టుపై విజయం సాధించింది.
రంగారెడ్డి జిల్లా జట్టులో చక్కటి ఆల్‌రౌండ్ ప్రతిభను కనపరిచిన అన్ష్ నాయన్ గుప్తా బ్యాటింగ్‌లో రాణించి 53 పరుగులు, బౌలింగ్‌లో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోవడంతో రంగారెడ్డి జిల్లా జట్టు అసన్నమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు నర్ణీత 25 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన అన్ష్ నాయన్ గుప్తా 53 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, జట్టులో అర్నావ్ రెడ్డి, పృథ్వీ సాయి చేరి 40 పరుగులు చేయగా, ఎన్.సుమేద్ 32 పరుగులు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జట్టు బౌలర్ తరుణ్ కుమార్ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన మేడ్చల్ - మల్కజిగిరి జట్టు నిర్ణీత 25 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది. రంగారెడ్డి జిల్లా జట్టు బౌలింగ్‌లో రాణించిన అన్ష్ నాయన్ గుప్తా 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, రామచంద్రుడు 15 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచిన అన్ష్ నాయన్ గుప్తా పలువురిని ఆకట్టుకున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN