రన్‌ మిషన్‌ ఖాతాలో మరో సెంచరీ.. ఇంకో రికార్డు..

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-11 14:51:04

img

పూణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌పై కూడా టీమిండియా పట్టు బిగిస్తోంది.. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ చెలరేగుతున్నారు. ఓవర్ నైట్ స్కోరు 273/3 దగ్గర రెండో రోజు ఆటను ప్రారంభించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్‌బోర్డును పరెగిత్తించారు.. ఇదే క్రమంలో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు రన్ మిషన్.. 173 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి మరో రికార్డు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ కెరీర్‌లో ఇది విరాట్‌కు 26వ సెంచరీ కావడం విశేషం. అంతటితో దాహం తీరలేదన్నట్టుగా మరో రికార్డును నెలకొల్పాడు కోహ్లీ.. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్ట్‌ సెంచరీల రికార్డుని సమం చేశాడు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 40 సెంచరీలు బాదేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు రహానె హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.. మొత్తానికి 113 ఓవర్లు ముగిసే సమయానికి రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ట నష్టానికి 356 పరుగులు చేసింది టీమిండియా.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN