రవిశాస్త్రి ఇప్పుడు మాత్రం ఏం చేశాడు: గంగూలీ రెస్పాన్స్

10 TV News Channel

10 TV News Channel

Author 2019-10-18 17:15:16

img

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదాపు ఫిక్స్ అయిపోయారంతా. ఈ క్రమంలో ప్రెస్ మీట్‌లో గంగూలీకి ప్రశ్నల దాడి మొదలైంది. ఇందులో భాగంగానే రవిశాస్త్రి విషయంలో గంగూలీ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేసి కోల్‌కతా చేరుకున్న గంగూలీకి ఘన స్వాగతం లభించింది. 

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు దాదా. ఓ మీడియా ప్రతినిధి 'మీరు రవిశాస్త్రితో మాట్లాడారా?' అని ప్రశ్నించాడు. 'దానికి గంగూలీ ఎందుకు? అతనిప్పుడేం చేశాడు?' అని చమత్కరించాడు. ఆ ప్రశ్నలో గంగూలీ ఏం చెప్పకపోయినా అర్థం కావాల్సిన వాళ్లకి అంతకంటే ఎక్కువే అర్థం అయింది. నెటిజన్లు ఈ వీడియోను ఫార్వార్డ్ చేసి రవిశాస్త్రిపై సెటైర్లు విసురుతున్నారు. 

2016లో టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక విషయంలో గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ల కమిటీ అనిల్ కుంబ్లేను ప్రతిపాదించారు. ఆ తర్వాత కుంబ్లే నియామకంలో నా పాత్ర ఉందని అనుకుంటే శాస్త్రి మూర్ఖత్వంలో ఉన్నట్లేనని మీడియా వేదికగా వెల్లడించాడు. 

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN