రసవత్తరంగా ఏసీఏ సీనియర్‌ ఉమన్‌ టీ - 20 టోర్నీ

Prajasakti

Prajasakti

Author 2019-11-07 03:46:47

img

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌
ఎసిఎ సీనియర్‌ ఉమెన్‌ టీ-20 క్రికెట్‌ టోర్నీలో రసవత్తరంగా సాగుతుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌, రైల్వేస్‌, బోరోడా జట్లు విజయం సాధించాయి. మూలపాడులోని డాక్టర్‌ గోకరాజు లైలా గంగరాజు ఎసిఎ క్రికెట్‌కాంప్లెక్స్‌లో బుధవారం నాకౌట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలి మ్యాచ్‌ బెంగాల్‌ - విదర్భ జట్ల మధ్య జరగగా బెంగాల్‌ జట్టు ఏడు పరుగుల అధిక్యతతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. జట్టులోని మిటా పాల్‌ 23, మందిర 25, పరుగులు చేయగా విదర్భ జట్టు బౌలర్‌ వైష్ణవి 21 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది. అనంతరం 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 101 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. జట్టులోని ఓపెనింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ దిషా దీపక్‌ 39, పరుగులు చేయగా బెంగాల్‌ జట్టు బౌలర్‌ శ్రేయోషి 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది.
ఏడు వికెట్లతో రైల్వేజ్‌ విజయం...
మరో మ్యాచ్‌ రైల్వేస్‌ - మహారాష్ట్ర జట్ల మధ్య జరగగా ఏడు వికెట్ల ఆధిక్యతతో రైల్వేస్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జట్టులోని ఓపెనింగ్‌ బ్యాట్స్‌ఉమెన్‌ ప్రియాంక 25, కిరణ్‌ ప్రభు 27, పరుగులు చేయగా 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్‌ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలో 101 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని బ్యాట్స్‌ఉమెన్‌ ఎస్‌.మేఘన 26, నుజాత్‌ 26, శ్రీరల్‌ 30 పరుగులు చేశారు.
28 పరుగులతో ఉత్తరప్రదేశ్‌ విజయం...
మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల ఆధిక్యతతో ఉత్తరప్రేద్‌ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర ప్రదేశ్‌జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 79 పరుగులు చేయగా, కర్ణాటక జట్టు 80 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 47 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. ఉత్తర ప్రదేశ్‌ జట్టు బౌలర్‌ మేఘన సింగ్‌ 9 పరుగులుఇచ్చి నాలుగు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభకను కనపరచింది.
హిమాచల్‌పై బరోడా విజయం...
సాయంత్రం బరోడా - హిమాచల్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు పది పరుగుల అధిక్యతతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసిది. జట్టులోని జనిత్‌ 24 పరుగులు చేయగా హిమాచల్‌ బౌలర్‌సుస్మిత 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకంది.అ నంతరం 83 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ జట్టు 72 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. జట్టులోని నీనా 27 పరుగులు చేయగా, బరోడా జట్టు బౌలర్లు షాలిని 19 పరుగులిచ్చి రెండు వికెట్లు, తన్వీర్‌ 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
8 నుండి సెమి ఫైనల్స్‌ మ్యాచ్‌లు...
8వ తేదీ నుండి సెమిఫైనల్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు బెంగాల్‌ - బరోడా జట్ల మధ్య మొదటి సెమి ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి రైల్వేస్‌ - విదర్భ జట్ల మద్య రెండవ సెమిఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN