రాంచీ టెస్టులో 'శతక్కొట్టిన' రోహిత్
రాంచీ టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను తన సెంచరీతో ఆదుకున్నాడు హిట్‌మ్యాన్. ఈ సిరీస్‌లో రోహిత్‌కిది మూడో సెంచరీ. ఓవరాల్‌గా ఆరో సెంచరీ. ఈ సిరీస్ లో రోహిత్ చెలరేగుతున్నాడు. లిమిటెడ్ క్రికెట్ ఓపెనర్‌గా సక్సెస్ అయిన రోహిట్ ఈ సిరీస్‌లోనూ సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా వచ్చిన రహానే కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు రోహిత్. ఈ ఇద్దరు అజేయంగా నాలుగో వికెట్‌కు వంద పరుగుల పార్టనర్‌షిప్‌ని నమోదు చేశారు. 46 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 184/3తో కొనసాగుతోంది.