రాంచీ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ: ధోని రికార్డు సమం

mykhel

mykhel

Author 2019-10-19 17:54:16

img

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.

మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వది కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు.

2000 పరుగుల మైలురాయిని

అంతేకాదు టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయిని కూడా రోహిత్ శర్మ అందుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా మయాంక్, పుజారా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో రోహిత్ శర్మ భాద్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు రహానే అతడికి చక్కటి సహకారం అందించాడు.

అరుదైన రికార్డు

రోహిత్ శర్మ సెంచరీ సాధించే క్రమంలో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. రాంచీ టెస్టులో రోహిత్ శర్మ తన సెంచరీని సిక్స్‌తోనే సాధించాడు. 132 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు.

img

హెట్‌మెయిర్‌ రికార్డు బద్దలు

దీంతో ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే విండిస్ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. 2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్ బద్దలు కొట్టాడు.

img

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

మరోవైపు 2019లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్‌(15) సిక్సర్ల రికార్డుని రోహిత్ బద్దలు కొట్టాడు. స్టోక్స్ 16 ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు కొడితే.. రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లోనే 13 సిక్సర్లను బాదాడు. మూడో టెస్టులో ఇప్పటికే 4 సిక్సర్లు బాదాడు.

img

భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు

ఇక, భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డుని కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. ఇప్పుడు దానిని రోహిత్ శర్మ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD