రాంచీ టెస్ట్: రోహిత్ 150.. తొలి ఓపెనర్‌గా ప్రపంచ రికార్డు!!

mykhel

mykhel

Author 2019-10-20 14:35:55

img

రాంచీ: రాంచీ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శ‌ర్మ 174 (220 బంతుల్లో: 24 ఫోర్స్, 4 సిక్స్‌లు) పరుగులు చేసాడు. ఫలితంగా రోహిత్‌ ఖాతాలో మరో రికార్డు చేరింది. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు సార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. మూడో టెస్టులో భాగంగా ఆదివారం సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌.. ఈరోజు ఆటలో 150కి పైగా పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

img

తొలి ఓపెనర్‌గా ప్రపంచ రికార్డు:

తాజాగా ఓపెనర్‌ పాత్రలో అరంగేట్రం చేసిన రోహిత్ రెండో రోజు ఆటలో 150కి పైగా పరుగులు చేసి.. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా కూడా రోహిత్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. 2012-13 సీజన్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్‌ క్లార్క్‌.. సఫారీలతో జరిగిన సిరీస్‌లో రెండు సార్లు 150కి పైగా పరుగులు సాధించాడు. అయితే క్లార్క్‌ మిడిల్‌ ఆర్డర్‌లో ఈ ఘనత సాధించాడు.

img

స్వదేశంలో అధిక సెంచరీలు:

రోహిత్ తొలి రోజు సెంచరీ చేయడంతో.. ఒక సిరీస్‌లో రెండు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1970లో సునీల్ గవాస్కర్ ఒకే సిరీస్‌లో 2 సెంచరీలు చేస్తే.. తాజాగా రోహిత్ (3) అధిగమించాడు. విదేశాల్లో ఒక్క సెంచరీ చేయకముందే స్వదేశంలోనే అధిక సెంచరీలు (6) చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మోమినుల్‌ హక్‌ (8) ముందున్నాడు.

img

హెట్‌మెయిర్‌ రికార్డు బద్దలు:

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్‌ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన అనంతరం ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ 2018-19 సీజన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్‌ తాజా బద్ధలు కొట్టాడు.

img

అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌:

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా రోహిత్ సవరించాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD