రాణించిన అంబటి రాయుడు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-02 07:13:00

ఆలూర్‌: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హైదరాబాద్‌ జట్టు రెండో విజయాన్నందుకుంది. ఎలైట్‌ గ్రూప్‌-ఏలో భాగంగా మంగళవారం కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. కెప్టెన్‌ అంబటి రాయుడు (87 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం లక్ష్య ఛేదనలో కర్ణాటక 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN