రాణించిన నెల్లూరు బ్యాట్స్‌మెన్‌

Prajasakti

Prajasakti

Author 2019-09-30 01:52:09

img

రాణించిన నెల్లూరు బ్యాట్స్‌మెన్‌

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌
అనంతపురంతో జరుగుతున్న మ్యాచ్‌లో నెల్లూరు బ్యాట్స్‌మెన్‌ సమయోచితంగా రాణించటంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 123 పరుగుల ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అనంత పురం బ్యాట్స్‌మెన్‌ ఆట ముగిచే సమయానికి వికెట్‌ నష్టానికి 139 పరుగులు చేసింది. క్రికెట్‌ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాల క్రీడామైదానంలో అండర్‌-14 గ్రూపు బి మ్యాచ్‌లలో భాగంగా అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అర్ధసెంచరీలతో బ్యాట్స్‌మెన్‌ రాణింపు
ఓవర్‌ నైట్‌ స్కోరు 105/2తో ఆట ప్రారంభించిన నెల్లూరు జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ అర్థ సెంచరీలు నమోదు చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్‌ అయింది. బి.అర్జున్‌ 54(117 బంతుల్లో, 11 ఫోర్లు), మన్విత్‌ కుమార్‌ రెడ్డి 51(111 బంతుల్లో; 8 ఫోర్లు), సిహెచ్‌ శివ చిత్రేష్‌ 53(96 బంతుల్లో; 9 ఫోర్లు) పరుగులు చేశారు.
రాణించిన అనంత బౌలర్లు
నెల్లూరు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయటంలో అనంతపురం బౌలర్లు సఫలీకృతులయ్యారు. టి.హర్షవర్దన్‌ 39 పరుగులిచ్చి 3 వికెట్లు, బి.శంకర నారాయణ 29 పరుగులిచ్చి 3 వికెట్లు, షేక్‌ సాహిల్‌ 45 పరుగులిచ్చి 2 వికెట్లు, సివి రాఘవేంద్ర శ్రీరామ్‌ 65 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు.
ధీటుగా బదులిస్తున్న
అనంత బ్యాట్స్‌మెన్‌
123 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అనంత పురం జట్టు బ్యాట్స్‌మెన్‌ రాణించారు. దీంతో ఆ జట్టు వికెట్‌ నష్టానికి 139 పరుగులు చేసింది. సి.భార్గవ్‌ రాజు 88(115 బంతుల్లో; 16 ఫోర్లు) అజేయంగా నిలిచారు. పి.మణిదీప్‌ 44(99 బంతుల్లో; 5 ఫోర్లు) పరుగులు చేశారు. కెహెచ్‌ వీరా రెడ్డి 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నెల్లూరు బౌలర్‌లలో షేక్‌ సాహిల్‌ 14 పరుగులిచ్చి 1 వికెట్‌ సాధించాడు. ఈ ఈ మ్యాచ్‌ను క్రికెట్‌ ప్రకాశం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, సిహెచ్‌ ప్రతాప్‌ కుమార్‌, కోశాధికారి కె.అప్పాజి పర్యవేక్షించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD