రాణిస్తున్న పాక్ బౌలర్లు.. లంక టాపార్డర్ ఔట్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 00:44:23

img

కరాచీ: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక లక్ష్య చేధనలో తడబడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. బాబర్ ఆజామ్ సెంచరీతో 305 పరుగులు చేసింది. అయితే 306 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక టాప్ ఆర్డర్ బోల్తా పడింది. పాకిస్థాన్ బౌలర్లు రాణించడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. గుణతిలక(14), సమరవిక్రమ(6), అవిష్క(0), ఒషాడా(1), లహిరు తిరిమన్నే(0) ఒకరి తర్వాత మరొకరు డ్రెస్సింగ్ రూం బాటపట్టారు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో షెహన్ జయసూర్య(55), దాసున్ శనక(46) ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN