రికార్డు సృష్టించిన కోహ్లీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 17:52:52

img

ముంబై: టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పుణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేసి.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కెరీర్‌లో కోహ్లీకిది ఏడో డబుల్ సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో 26వ సెంచరీ నమోదుచేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని దాటాడు కొహ్లీ. కాగా, బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు. టీమిండియా 151 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 563 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో రాణిస్తున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN