రూ. 50కే డే నైట్ టెస్టు టికెట్

Mana Telangana

Mana Telangana

Author 2019-10-31 02:40:37

img

కోల్‌కతా అభిమానులకు పండగే..

కోల్‌కతా : భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్ మైదానంలో జరుగనున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ కనీస టికెట్ ధరను రూ.50గా నిర్ణయించినట్టు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు. త్వరలోనే బిసిసిఐతో చర్చించి దీన్ని అధికారికంగా ధ్రువీకరిస్తామన్నారు. కోల్‌కతాలో జరిగే డే నైట్ టెస్టు మ్యాచ్‌కు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని దాల్మియా వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు ఎక్కువ మంది అభిమానులు హాజరయ్యేలా చూస్తామన్నారు. ఇందు కోసం కనీస టికెట్ ధరను 50 రూపాయులగా నిర్ణయించామన్నారు. ఇది అభిమానులను ఆకర్షించడం ఖాయమన్నారు. తక్కువ ధరతో టికెట్ అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది మ్యాచ్‌ను చూసేందుకు రావడం తథ్యమన్నారు.

ఇదిలావుండగా భారత గడ్డపై జరుగనున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు సయితం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారన్నారు. కాగా, అభిమానుల సౌకర్యార్థం కోసం ఈ టెస్టు మ్యాచ్‌ను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రాత్రి వేళలలో మంచు కురిసే అవకాశం ఉండడం, చలి కూడా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, టికెట్ల విక్రయం త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు రూ.100, రూ.150 టికెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు దాల్మియా వివరించారు. వన్డేలు, టి20లకు టికెట్ల ధర అధికంగా ఉంచినా విపరీత డిమాండ్ ఉంటుందని, అయితే టెస్టులకు మాత్రం అటువంటి ఆదరణ ఉండదన్నారు. అందుకే టికెట్ల ధరలను తగ్గించి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD