రెండు ఒలింపిక్స్‌ బెర్తులు

Prajasakti

Prajasakti

Author 2019-10-07 02:02:33

img

* ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ముగిసిన భారత్‌ ప్రదర్శన
దోహ : ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరోసారి నిరాశపర్చింది. ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌లో ఎలాంటి పతకాలు సాధించలేకపోయిన భారత్‌ రెండు ఒలింపిక్స్‌ బెర్తులు మాత్రం సాధించింది. 2019 ఛాంపియన్‌షిప్‌లో పురుషుల మారథన్‌లో గోపి థోనకల్‌ పోరుతో భారత్‌ పోరాటం ముగిసింది. ఆసియా ఛాంపియన్‌ గోపి 2 గంటల, 15 నిమిషాల, 57 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 21వ స్థానంలో నిలిచాడు. పురుషుల మారథాన్‌ ఆటగాళ్లను అధిక వేడి, ఉక్కపోత తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో మొత్తంగా 73 మంది ఈ రేసులో పాల్గొన్నా 55 మంది మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. ఈ 55 మందిలో గోపి 21వ స్థానంలో నిలిచాడు. మరో 18 మంది రేసును పూర్తి చేయలేకపోయారు. కాగా, మహిళల రిలేలో భారత్‌ బృందం 6వ స్థానంలోనూ, పురుషుల రిలే విభాగంలో భారత్‌ ఏడో స్థానంలోనూ నిలిచింది.
ప్రస్తుత ఛాంపియన్‌షిప్‌లో 27 మందితో ఉన్న భారత్‌ బృందం పోటీ పడింది. పతకాల విషయంలో భారత బృందంపై ఎలాంటి అంచనాలేకపోయినా.. మూడు విభాగాల్లో భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరుకోవడంతో ఆశలు రెకెత్తాయి. మిక్స్‌డ్‌ 4,400 రిలే, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌, మహిళల జావెలన్‌ త్రోనూలోనూ భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. వీటిలో పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో అవినాష్‌ సేబల్‌, మిక్స్‌డ్‌ 4,400 రిలేనూ భారత్‌ బృందంలకు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం అయింది. జావెలిన్‌ త్రోలో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా అన్నురాణి రికార్డుల్లో నిలిచింది.2019లోనూ భారత్‌కు ఎలాంటి పతకం రాకపోవడంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో 2003లో అంజు బాబీ (లాంగ్‌జంప్‌) సాధించిన పతకమే భారత్‌ నుంచి చివరి పతకంగా ఉంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD