రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-11-10 23:51:00

నాగ్‌పూర్: భారత్ నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్ దీపక్ చాహర్ దారుణమైన దెబ్బ కొట్టాడు. ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్‌ (0)లను వెనక్కి పంపాడు. 8 బంతులు ఆడిన లిటన్ దాస్ రెండు ఫోర్లు కొట్టి జోరు మీదున్నట్టు కనిపించాడు. అయితే, చాహర్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లిటన్ దాస్ అవుట్‌తో క్రీజులోకి వచ్చిన సౌమ్య సర్కార్‌ ఆ తర్వాతి బంతికే గోల్డెన్ డక్‌ అయ్యాడు. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మొహమ్మద్ నైమ్, మొహమ్మద్ మిథున్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN