రెండు వికెట్లు చాలు..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-22 05:36:52

img

  • క్లీన్‌స్వీప్‌ దిశగా భారత్‌
  • చెలరేగిన షమి, ఉమేశ్‌
  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 162
  • ఫాలోఆన్‌లో 132/8

ఓవైపు భారత బ్యాట్స్‌మెన్‌ దూకుడు... మరోవైపు బౌలర్ల ఉచ్చులో పడి దక్షిణాఫ్రికా జట్టు విలవిల్లాడుతోంది. రోహిత్‌ శర్మ డబుల్‌, రహానె శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించగా, తామేమీ తక్కువ కాదన్నట్టు పేసర్లు మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ సఫారీలపై పంజా విసిరారు. అటు స్పిన్నర్లు జడేజా, షాబాజ్‌ నదీమ్‌ కూడా ప్రభావం చూపడంతో పర్యాటక జట్టు ఒక్క రోజే రెండుసార్లు బ్యాటింగ్‌కు దిగి 16 వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పుణె టెస్టు తర్వాత మరోసారి ఫాలో ఆన్‌ ఆడుతున్న డుప్లెసి సేనపై తొలి క్లీన్‌స్వీప్‌ విజయం కోసం భారత్‌కు మరో రెండు వికెట్లు చాలు!

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడం ఇక లాంఛనమే. భారత బౌలర్ల ఆధిపత్యంతో మూడో రోజు ఆట పూర్తి ఏకపక్షంగా సాగింది. దీంతో ఈ సిరీస్‌లో మరో ఇన్నింగ్స్‌ విజయానికి భారత్‌ కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది. సోమవారం పేసర్లు మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వికెట్ల వేటను సాగించడంతో దక్షిణాఫ్రికా రెండు ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఫాలోఆన్‌లో ఉన్న సఫారీ జట్టు ఆట ముగిసేసరికి 46 ఓవర్లలో 8 వికెట్లకు 132 రన్స్‌ చేసింది. డిబ్రుయిన్‌ (30 బ్యాటిం గ్‌) పోరాడుతున్నాడు. క్రీజులో అతడితో పాటు నోర్టే (5) ఉన్నాడు. షమి 3, ఉమేశ్‌ 2 వికెట్లు తీశారు. ఇన్సింగ్స్‌ ఓటమిని తప్పించు కోవాలంటే ఆ జట్టు ఇంకా 203 రన్స్‌ చేయాలి. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్న దశలో ఇది అసాధ్యమే. దీంతో నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత్‌ ఖాతాలో మరో భారీ విజయం

ఖాయం కానుంది!

అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. జుబెయిర్‌ హంజా (62) అర్ధసెంచరీ సాధించగా.. లిండే (37), బవుమా (32) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఉమేశ్‌కు 3.. షమి, నదీమ్‌, జడేజాకు రెండేసి వికెట్లు దక్కాయి. 335 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్క డంతో ప్రత్యర్థి జట్టును భారత్‌ ఫాలోఆన్‌ ఆడించింది.

హంజా ఒక్కడే..: ఓవర్‌నైట్‌ స్కోరు 9/2తో సోమ వారం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాను జుబె యిర్‌ హంజా అర్ధ శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశా డు. మరోవైపు పేసర్లు షమి, ఉమేశ్‌తో పాటు లెఫ్టామ్‌ స్పిన్నర్లు జడేజా, నదీమ్‌ల దాడితో టపటపా వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్‌ డుప్లెసి (1)ని ఓవర్‌నైట్‌ స్కోరు వద్దే ఉమేశ్‌ చక్కటి అవుట్‌ స్వింగర్‌తో దెబ్బతీశాడు. ఈ స్థితిలో బవుమాతో కలిసి హంజా భారత్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. వన్డే తరహాలో ఆడిన హంజా పదో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఆతర్వాత కూడా ఇదే రీతిన చెలరేగిన అతడు భారీ సిక్సర్‌తో 56 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. నిలకడగా సాగుతున్న ఈ జోడీకి జడేజా బ్రేక్‌ వేశాడు. 28వ ఓవర్‌లో హంజాను బౌల్డ్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్‌లోనే బవుమాను అవుట్‌ చేసిన నదీమ్‌ టెస్టుల్లో తొలి వికెట్‌ సాధించాడు. లంచ్‌ విరామానికి 129/6తో ఉన్న ప్రొటీస్‌ ఆ తర్వాత కూడా ఎలాంటి పోరాటం ప్రదర్శించలేదు. అయితే జార్జి లిండేకు నోర్టే (55 బంతుల్లో 4) ఓపిగ్గా ఆడి సహకారం అందించాడు. తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరూ 32 పరుగులే చేసినా 104 బంతులను ఎదుర్కొని భారత్‌ను విసిగించారు. ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో అవుట్‌ కావడంతో రెండో సెషన్‌లోనే ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఫాలోఆన్‌లోనూ అదే వరుస..: భారీ ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించడంతో కెప్టెన్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌ ఆడించాడు. ఈసారి కూడా సఫారీల పేలవ ప్రదర్శనలో మార్పు కనిపించలేదు. షమి పదునైన బంతుల ధాటికి పది ఓవర్లలోపే టాప్‌-4 బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌లో కూర్చున్నారు. ఓపెనర్‌ డికాక్‌ (5)ను ఉమేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా హంజా (0), డుప్లెసి (4), బవుమా (0)ను షమి అవుట్‌ చేశాడు. ఓపెనర్‌ ఎల్గర్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో కాస్త ముందుగానే టీవిరామం ప్రకటించారు.

లిండే, పీట్‌ పోరాటం: చివరి సెషన్‌లో కొద్దిసేపటికే కీపర్‌ క్లాసెన్‌ (5)ను ఉమేశ్‌ ఎల్బీ చేయడంతో జట్టు 36 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయి దారుణ స్థితిలో నిలిచింది. ఈ దశలో అనూహ్యంగా జార్జి లిండే (27), పీట్‌ (23) ఎదురొడ్డి ఆడారు. ఓపిగ్గా ఆడిన వీరు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆశలు పెంచారు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించిన లిండే రనౌట్‌ కావడంతో ఏడో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు డిబ్రుయిన్‌, పీట్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు మరో 31 పరుగులు జోడిం చాడు. కానీ పీట్‌ను జడేజా, రబాడను అశ్విన్‌ అవుట్‌ చేయడంతో జట్టు స్కోరు 121/8తో నిలిచింది. ఈదశలో మ్యాచ్‌ ఫలితం కోసం ఆటను అంపైర్లు మరో అర్ధగంట పొడిగించారు. కానీ మూడు ఓవర్ల తర్వాత వెలుతురు తగ్గడంతో మూడోరోజును ముగించారు.

రిషభ్‌ పంత్‌ కీపింగ్‌...

భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. దీంతో చివరి గంట ఆటలో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన బంతి బౌన్స్‌ కావడంతో బ్యాట్స్‌మన్‌ లిండే ఆడలేకపోయాడు. దీన్ని అందుకునేందుకు సాహా ప్రయత్నించగా అది అతడి చేతి బొటనవేలికి తాకింది. వెంటనే ఫిజియో నితిన్‌ పటేల్‌ వచ్చి అతడిని డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లడంతో కీపర్‌ పంత్‌ మైదానంలోకి వచ్చాడు. రెండేళ్ల క్రితం మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం గాయపడిన కీపర్‌ స్థానంలో ఇలా సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌ ఆడేందుకు అవకాశం లభించింది. గతేడాది దక్షిణాఫ్రికా టూర్‌లో పార్థివ్‌ గాయపడితే దినేశ్‌ కార్తీక్‌ కూడా ఇలాగే కీపింగ్‌ చేశాడు.

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా డిబ్రుయిన్‌

పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ విసిరిన బౌన్సర్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా డిబ్రుయిన్‌ బ్యాటింగ్‌కు దిగాడు. టీబ్రేక్‌కు కొద్ది నిమిషాల ముందు ఉమేశ్‌ విసిరిన షార్ట్‌ బాల్‌ను ఎల్గర్‌ ఆడేందుకు ప్రయత్నించగా అది చెవి పైభాగాన బలంగా తాకింది హెల్మెట్‌ ధరించినప్పటికీ బాధతో విలవిల్లాడిన ఎల్గర్‌ వెంటనే కుప్పకూలాడు. అనంతరం ఫిజియోతో మైదానం వీడాడు. అతడి గాయాన్ని పరీక్షించిన తర్వాత మూడో టెస్టుకు దూరమైనట్టు ప్రకటించారు. అయితే తన స్థానంలో ఏడో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన డిబ్రుయిన్‌ ధాటిగా ఆడుతూ జట్టును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎక్కువ సార్లు (8) ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌ ఆడించిన భారత కె ప్టెన్‌ కోహ్లీ. ఆ తర్వాత అజరుద్దీన్‌ (7), ధోనీ (5), గంగూలీ (4) ఉన్నారు.

1964/65లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ దక్షిణాఫ్రికా రెండుసార్లు ఫాలోఆన్‌ ఆడింది. అయితే వరుసగా రెండు టెస్టుల్లోనూ ఇలా ఆడాల్సి రావడం 2001/02 (ఆసీస్‌పై) తర్వాత ఇదే తొలిసారి.

స్వదేశంలో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో 3+ వికెట్లు సాధించిన తొలి భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD