రెండో టీ20లోనూ పాక్ ఓటమి
- సిరీస్ లంక కైవసం
లాహోర్: పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంక 35 పరుగులతో విజయ ఢంకా మోగించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేశారు. బనుక రాజపక్స (77), షిహాన్ జయసూర్య (34) రాణించారు. లక్ష్య ఛేదనలో పేసర్ నువాన్ ప్రదీప్ (4/25) ధాటికి పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. ఇమాద్ వసీం 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ రాజపక్సకు లభించింది.