రెండో టీ20లోనూ పాక్‌ పరాజయం

Prajasakti

Prajasakti

Author 2019-10-08 03:46:53

img

* సిరీస్‌ శ్రీలంక కైవసం
లాహోర్‌: వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న పాకిస్తాన్‌ జట్టు టీ20 సిరీస్‌ను కోల్పోయింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన రెండో టీ20లోనూ పర్యాటక శ్రీలంక చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను 0-2తో శ్రీలంకకు కోల్పోయింది. శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రాజపక్సే 77 (48 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేశాడు. అనంతరం పాకిస్తాన్‌ 19 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. ఇమాద్‌(47), సర్ఫరాజ్‌(26) రాణించారు. ప్రదీప్‌(4/25), హసరంగ(3/38) లంక గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆఖరి, మూడో టీ20 బుధవారం జరగనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD