రెండో టీ20 ఆసీస్‌దే

Prajasakti

Prajasakti

Author 2019-11-06 05:13:48

img

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా జట్టు రెండో టీ20లో పర్యాటక పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... నేటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(50), ఇఫ్తికర్‌ అహ్మద్‌(62నాటౌట్‌) రాణించారు. ఆగర్‌కు రెండు, కమ్మిన్స్‌, రిచర్డుసన్‌కు తలా ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్టీవ్‌ స్మిత్‌(80నాటౌట్‌), డేవిడ్‌ వార్నర్‌(20) రాణించారు. ఆఖరి, మూడో టీ20 పెర్త్‌ వేదికగా శుక్రవారం జరగనుంది. ఆ తర్వాత నవంబర్‌ 21 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD