రేపటి నుండి మచిలీపట్నం- చెన్నై ఆర్టీసీ గరుడ సర్వీసు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-09 04:09:35

మచిలీపట్నం : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జిల్లా కేంద్రం మచిలీపట్నం నుండి చెన్నైకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసు కల సాకారం కాబోతోంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కృషి మేరకు ఈ నెల 10వతేదీ నుండి మచిలీపట్నం-చెన్నైకు గరుడ ఎసీ సర్వీసును ప్రారంభించనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మచిలీపట్నం నుండి విశాఖపట్నం, హైదరాబాద్‌కు నడుపుతున్న నైట్ రైడర్ సర్వీసులకు ప్రయాణీకుల నుండి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చెన్నైకు కూడా నైట్ రైడర్ సర్వీసును నడపనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నుండి ప్రారంభమయ్యే ఈ సర్వీసు నేలపాడు సచివాలయం (హైకోర్టు) వరకు వెళుతుందన్నారు. ప్రతి రోజూ ఉదయం 7.10ని.లకు మ చిలీపట్నం నుండి బయలుదేరి మధ్యా హ్నం 2గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే నేలపాడు హైకోర్టు నుండి ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గం.లకు మచిలీపట్నం చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దల కు రూ.1060లు కాగా పిల్లలకు రూ. 860లుగా నిర్ణయించినట్లు తెలిపారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD