రోహిత్‌ కెప్టెన్సీకి పరీక్ష

Prajasakti

Prajasakti

Author 2019-11-07 12:55:01

img

టీమిండియాకు టీ20 ఫార్మాట్‌ అసలు కలిసిరావడం లేదు. గత ఏడాది వెస్టిండీస్‌పై సిరీస్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో భారత్‌ అనూహ్యంగా పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి బంగ్లాకు 1-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నా... నేడు జరిగే రెండో టీ20 రోహిత్‌ శర్మ కెప్టెన్సీకి పరీక్ష కానుంది.

రాజ్‌కోట్‌ : న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారతజట్టు అనూహ్యంగా బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలైంది. విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్‌ శర్మకు నేటి మ్యాచ్‌ సవాలు కానుంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఢిల్లీ మ్యాచ్‌లో ముఖ్యంగా బ్యాట్స్‌మన్ల వైఫల్యం కారణంగానే ఓటమికి కారణమని చెప్పుకోవచ్చు.

టీమిండియా బ్యాట్స్‌మన్లు 120 బంతుల్లో 148 పరుగులు మాత్రమే చేయగలిగారు. శిఖర్‌ ధావన్‌(41), పంత్‌(27), శ్రేయస్‌ అయ్యర్‌(22) రాణించగా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(9), కెఎల్‌ రాహుల్‌(15), దూబే(1) ఘోరంగా నిరాశపరిచారు. రాజ్‌కోట్‌ వేదిక బ్యాట్స్‌మన్లకు స్వర్గధామం కాబట్టి ఈ మ్యాచ్‌లో రోహిత్‌తోపాటు బ్యాట్స్‌మన్లు సమిష్టిగా రాణించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఓవైపు వర్షం పొంచి వున్నా... తాడో పేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌ను భారత్‌ తప్పక గెలిస్తేనే సిరీస్‌లో ముందుకెళ్లే అవకాశముంది.
బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాంతులు
ఢిల్లీ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సౌమ్య సర్కార్‌, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు తెలిసింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్‌ నిర్వహించడంతో బిసిసిఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బిసిసిఐ తిరస్కరించగా.. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తేల్చిచెప్పాడు.
భారతజట్టు : రోహిత్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, మనీష్‌ పాండే, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సంజు శాంసన్‌, శివమ్‌ దూబే.
బంగ్లాదేశ్‌జట్టు : మహ్మదుల్లా(కెప్టెన్‌), లింటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌(వికెట్‌ కీపర్‌), అఫిప్‌ హొసైన్‌, మహ్మద్‌ మిథున్‌, ముసద్దెక్‌ హొసైన్‌, అబు హైదర్‌, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌, అరాఫత్‌ సన్నీ, అల్‌-అమిన్‌, తైజుల్‌ ఇస్లామ్‌.

పొంచివున్న వర్షం ముప్పు
రెండో టీ20కి వర్షం ముప్పూ పొంచి ఉంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకా శముందని ఇక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. బుధవారం సాయంత్రం కారుమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ జరిగేరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఐఎండి జయంత్‌ బుధవారం తెలిపారు. ఇప్పటికే తొలి టీ20 ఓడిన భారత్‌ ఈ మ్యాచ్‌ రద్దయితే 10న నాగ్‌పూర్‌ వేదికగా జరిగే ఆఖరి టీ20లో గెలవాల్సి ఉంటుంది.

- ఓటములనుంచి యువకులు నేర్చుకుంటారు
రాజ్‌కోట్‌ పిచ్‌ బ్యాట్స్‌మన్‌కు స్వర్గధామం. దానిని అనుసరించి జట్టులో మార్పులు చేస్తాం. యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు మేం ఎంచుకున్న ఫార్మాట్‌ ఇది. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో యువకులను ప్రయత్నిస్తున్నాం. తొలి టీ20 ఓటమికి ఇది కూడా కారణం. ఎందుకంటే మిగతా ఫార్మాట్లలో మేం పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతాం. టీ20ల్లో యువకులను పరీక్షించడంలో జట్టుకు హాని లేదు. ఈ ఫార్మాట్లో సత్తాచాటి ఎంతోమంది వన్డే, టెస్టులకు ఎంపికయ్యారు. మా రిజర్వ్‌బెంచ్‌ సాధ్యమైనంత పటిష్టంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. మేం మ్యాచ్‌లు గెలవక తప్పదు. ఓటమిల నుంచి యువకులు నేర్చుకుంటారు.
- రోహిత్‌ శర్మ, కెప్టెన్‌

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN