రోహిత్‌ కెరీర్‌ బెస్ట్‌ ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-08 05:25:33

దుబాయ్‌: సౌతాఫ్రికాతో విశాఖపట్నం టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో దుమ్ము రేపిన రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా కెరీర్‌ బెస్ట్‌తో 17వ స్థానానికి చేరాడు. అతడు 36 ర్యాంకులు ఎగబాకాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 38 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌లో అత్యుత్తమంగా 25వ ర్యాంకు సాధించాడు. కెప్టెన్‌ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకొన్నా, అతడి పాయింట్లు 899కిపడిపోయాయి. జనవరి 2018 తర్వాత విరాట్‌ పాయింట్ల సంఖ్య 900 కంటే తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి.

అగ్రస్థానంలో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ కంటే కోహ్లీ 38 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు. తొలి టెస్ట్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 14వ స్థానంనుంచి 10వ ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్‌ టాప్‌-5లో అడుగుపెట్టాడు. కెరీర్‌ బెస్ట్‌గా 710 పాయింట్లు దక్కించుకున్న పేసర్‌ షమి 18వ ర్యాంకునుంచి 16కు చేరాడు. ఆల్‌రౌండర్లలో జడేజా రెండో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకొంది. మూడో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌ (122) కంటే టీమిండియా (125 పాయింట్లు) 3 పాయింట్లు ముందుంది. ఆస్ట్రేలియా (151) టాప్‌ర్యాంకులో కొనసాగుతోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD