రోహిత్‌ శర్మ అర్ద సెంచరీ.. భారత్‌ స్కోరు 9 ఓవర్లకు 92/0

Nava Telangana

Nava Telangana

Author 2019-11-08 00:24:00

రాజ్‌కోట్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ-20లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. తొలుత బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 153 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ, ధవన్‌లు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 58 అర్దసెంచరీ పూర్తి చేయగా దావన్‌ 28 పరుగులతో ఉన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN