రోహిత్ సెంచరీ..భారీ స్కోర్ దిశగా భారత్

Zee News India

Zee News India

Author 2019-10-02 16:28:46

img

విశాఖ వేదికగా జరగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఓ ఎండ్ లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ (107) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఎండ్ నుంచి మయాంగ్ అగర్వాల్ తనదైన శైలిలో పరుగులు(80) రాబడుతున్నారు. వీరు ఇరువురు కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం 57 ఓవర్లు ఎదుర్కొన్న భారత్ ... వికెట్లేమీ కోల్పోకుండా 190 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సఫారీలు భారత ఓపెనర్ల జోడీని విడగొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా .. వారి ఆశ నెరవేరడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో నిలబడ్డారు సఫారీ బౌలర్లు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN