లంచ్‌ విరామానికి భారత్ 324/1

Nava Telangana

Nava Telangana

Author 2019-10-03 14:42:00

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 324/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ 202/0తో ప్రారంభించిన టీమ్‌ ఇండియా ఓపెనర్లు సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. మయాంక్‌ అగర్వాల్‌ (138*, 274 బంతుల్లో: 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తన కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్‌ శర్మ (176, 244 బంతుల్లో: 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తన జోరును కొనసాగించాడు. 224 బంతుల్లోనే 150 పరుగులను పూర్తిచేసుకున్నాడు. అనంతరం మహారాజ్‌ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాదిన రోహిత్‌ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 317 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌తో కలిసి రోహిత్‌ రికార్డు భాగస్వామ్యాన్ని (317) నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (6*) ఆచితూచి ఆడుతున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN