లంచ్ బ్రేక్: భారత్ స్కోర్ ఎంతంటే..
పుణె: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్మెన్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రబడా బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ(14) వెనుదిరిగాడు. ఈ దశలో మయాంక్, పుజారాలు జట్టుకు అండగా నిలిచాడు. దీంతో తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్‌లో మయాంక్(34), పుజారా(19) ఉన్నారు.