వచ్చే సెప్టెంబరు వరకే సౌరవ్‌ పదవి !

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 06:08:00

img

బీసీసీఐ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ ఆ పదవిలో వచ్చే ఏడాది సెప్టెంబరు వరకే కొనసాగనున్నాడు. లోధా సంస్కరణల ప్రకారం ఆ తర్వాత సౌరవ్‌కు ‘కూలింగ్‌ ఆఫ్‌’ సమయం ప్రారంభ కానుంది. అంటే..బీసీసీఐలో ఓ పదవిని వరుసగా రెండు దఫాలు నిర్వర్తించిన వారు ఆపై మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది.. 47 ఏళ్ల సౌరవ్‌ రెండోసారి క్యాబ్‌ చీఫ్‌గా వ్యవహరిస్తుందున్నందున వచ్చే ఏడాదిసెప్టెంబరులో పదవినుంచి వైదొలగాల్సి ఉంటుంది.

విజ్జీ తర్వాత...

బీసీసీఐకి 65 సంవత్సరాల తర్వాత ఓ మాజీ క్రికెటర్‌ అధ్యక్షుడిగా బాఽధ్యతలు చేపట్టనున్నాడు. విజయనగరం మహారాజు పూసపాటి విజయ ఆనంద గజపతి రాజు (విజ్జీ) 1936లో ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా భారత జట్టుకు మూడు టెస్టుల్లో సారథిగా వ్యవహరించారు. 1954లో ఆయన బోర్డు చీఫ్‌గా ఎన్నిక కావడం విశేషం. అలాగే సునీల్‌ గవాస్కర్‌, హైదరాబాదీ శివలాల్‌ యాదవ్‌ కొద్దికాలంపాటు బోర్డు తాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN