వన్డే జాతీయ క్రికెట్ విజేత కర్నాటక

Teluguglobal

Teluguglobal

Author 2019-10-26 10:56:06

img

  • విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడుకు షాక్

జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీని..మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని కర్నాటక జట్టు గెలుచుకొంది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో తమిళనాడును 60 పరుగులతో కర్నాటక చిత్తు చేసి ట్రోఫీ అందుకొంది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటయ్యింది. కర్నాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్…తన పుట్టినరోజు నాడే హ్యాట్రిక్ సాధించడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశాడు.

తమిళనాడు ఆటగాళ్లలో ఓపెనర్ అభినవ్ ముకుంద్ 85, బాబా అపరాజిత 66, విజయ్ శంకర్ 38, షారుక్ ఖాన్ 27 పరుగులు సాధించారు.

కర్నాటక బౌలర్లలో మిథున్ 34 పరుగులిచ్చి 5 వికెట్లు, కౌశిక్ 2 వికెట్లు పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ కు వానదెబ్బ…

253 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగాల్సిన కర్నాటక ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే వానదెబ్బ తలిగింది. దీంతో ..విజేడీ విధానం ద్వారా…కర్నాటక విజయలక్ష్యాన్ని 23 ఓవర్లలో 87 పరుగులుగా నిర్ణయించారు.

కర్నాటక 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులతో విజేతగా నిలిచింది. ఓపెనర్ రాహుల్ 52, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

అభిమన్యు మిథున్ కు ప్లేయర్ ఆఫ్ ది టో్ర్నీ అవార్డు దక్కింది. కర్నాటక జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకోడం ఇది నాలుగోసారి.

గతంలో 2013-14, 2014-15, 2017-18 సీజన్లలో విజేతగా నిలిచిన కర్నాటక… తిరిగి 2019-2020 సీజన్ టైటిల్ ను సైతం కైవసం చేసుకోగలిగింది.

గత రెండువారాలుగా సాగిన ఈ టో్ర్నీలో వివిధ రాష్ట్ర్రాలు, సంస్థలకు చెందిన 38 జట్లు తలపడగా… చివరకు కర్నాటక, తమిళనాడు జట్లు ఫైనల్స్ చేరుకోగలిగాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN