వన్డే సిరీస్‌ పాకిస్థాన్‌దే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-03 05:39:34

  • చివరి మ్యాచ్‌లో లంకపై విజయం

కరాచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీ్‌సను పాకిస్థాన్‌ 2-0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 297/9తో భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ గుణతిలక (133), షణక (43), తిరిమన్నె (36), భానుక (36) రాణించారు. మహ్మద్‌ ఆమెర్‌ (3/50) మూడు వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్థాన్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసి నెగ్గింది. ఫఖర్‌ జమాన్‌ (76), అబిద్‌ అలీ (74), హారిస్‌ సొహైల్‌ (56) సత్తా చాటారు. నువాన్‌ ప్రదీప్‌ (2/53) రెండు వికెట్లు తీశాడు. తొలి వన్డే వర్షంతో రద్దు కాగా..రెండో మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN