వన్ మేన్ షో… మూడు ఫార్మాట్లకు అతడే కింగ్ !

Dharuvu

Dharuvu

Author 2019-10-02 17:02:26

img

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ఈరోజు ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. ఈమేరకు బ్యాట్టింగ్ కు దిగిన ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ బీకర ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం టీ టైమ్ కి ఇండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ఓపెనింగ్ విషయంలో రోహిత్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వీటనింటినీ పక్కకి నెట్టేసి నిన్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి అతడికి అండగా నిలిచాడు. తానేంటో నిరూపించుకుంటాడంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో ఈరోజు ఓపెనర్ గా వచ్చిన రోహిత్ అజేయ సెంచరీ తో రాణిస్తున్నాడు. దాంతో అతడిపై నెగటివ్ గా మాట్లాడిన అందరి నోళ్ళు మూతబడ్డాయి. సీనియర్లు సైతం మూడు ఫోర్మాట్ లకు అతడే కింగ్ అని చెబుతున్నారు.మరోపక్క మయాంక్ అగర్వాల్ 84 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN