వార్నర్ 100.. లంక 99

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-29 04:40:00

img
అడిలైడ్: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) తన పుట్టిన రోజు నాడు.. శ్రీలంకపై అజేయ సెంచరీతో విరుచుకుపడ్డాడు. తద్వారా టెస్టు, వన్డే, టీ20ల్లో మూడంకెల స్కోరు చేసిన మూడో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో వాట్సన్, మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ సాధించారు. వార్నర్ మెరుపులతో ఆదివారం లంకతో జరిగిన తొలి టీ20లో ఆసీస్ 134 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో కంగారూలకు పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా.. లంకేయులకు ఇదే భారీ ఓటమి.

సిరీస్‌కు ముందు జరిగిన ప్రెసిడెంట్స్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ వాటర్ బాయ్ అవతారమెత్తి తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగా.. దాన్ని పునికిపుచుకున్న ఆస్ట్రేలియన్లు చెలరేగిపోయారు. వార్నర్‌తో పాటు కెప్టెన్ ఫించ్ (64; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరువడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జంపా (3/14), స్టార్క్ (2/18), కమిన్స్ (2/27) ధాటికి లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.

స్టార్క్ దూరం..
తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఆసీస్ స్పీడ్‌స్టర్ మిషెల్ స్టార్క్ లంకతో జరుగనున్న తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు అతడు టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD