వాలీబాల్ టోర్నీ షురూ..

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-17 02:56:00

నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో సీబీఎస్‌ఈ చెన్నై రీజియన్ అంతర్రాష్ట్ర అండర్-17, 19 వాలీబాల్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి 70 జట్లు, 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈనెల 19 వరకు నాలుగు రోజుల పాటు టోర్నీ జరుగనుంది. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సీబీఎస్‌ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. సీబీఎస్‌ఈ క్రీడలు పట్టణాలకే పరిమితమైనప్పటికీ, సెంట్రల్ బోర్డు ఆదేశానుసారం గ్రామీణ ప్రాంతమైన జన్నేపల్లిలో సీబీఎస్‌ఈ టోర్నీ నిర్వహించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్యగౌడ్, ఎండీ హరిత, ప్రిన్సిపాల్ భాస్కర్, సీబీఎస్‌ఈ చెన్నై రీజియన్ పర్యవేక్షకుడు చిన్నయాన్, శివప్రసాద్ పాల్గ్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN