విండీస్‌దే తొలి వన్డే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-07 05:39:21

లఖ్‌నవ్‌: మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ 45.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్‌ షా (61), ఇక్రమ్‌ అలికిల్‌ (58) హాఫ్‌ సెంచరీలు చేశారు. జాసన్‌ హోల్డర్‌, చేజ్‌, రొమారియో షెపర్డ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్‌.. రోస్టన్‌ చేజ్‌ (94), షాయ్‌ హోప్‌ (77 నాటౌట్‌) రాణించడంతో 46.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 రన్స్‌ చేసి విజయం సాధించింది. హోప్‌, చేజ్‌ మూడో వికెట్‌కు 163 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. స్పిన్నర్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ (2/33) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత్‌ను సొంతగడ్డగా చేసుకుని అఫ్ఘాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD