విండీస్‌దే రెండో వన్డే

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 03:27:59

  • 47 పరుగులతో అఫ్ఘాన్‌ ఓటమి

లఖ్‌నవ్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో 47 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. తొలుత విండీస్‌.. నికోలస్‌ పూరన్‌ (67)అర్ధ శతకంతోపాటు టాపార్డర్‌ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 247/9 స్కోరు చేసింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (54), షాయ్‌ హోప్‌ (43) శుభారంభాన్ని అందించారు. నవీన్‌ అల్‌ హక్‌ (3/60) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో అఫ్ఘాన్‌.. విండీస్‌ బౌలింగ్‌ ధాటికి 45.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. నజీబుల్లా (56) టాప్‌ స్కోరర్‌. కాట్రెల్‌ (3/29), చేజ్‌ (3/30), హెడెన్‌ వాల్ష్‌ (3/36) తలో మూడు వికెట్లు కూల్చారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN