విజయనగరంలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు

Prajasakti

Prajasakti

Author 2019-09-25 04:54:32

img

* 26 నుంచి 28 వరకు నిర్వహణ
ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌:
విజయనగరం జిల్లా చింతలవలసలోని పివిజి రాజు ఎసిఎ స్పోర్స్‌ కాంప్లెక్స్‌ క్రికెట్‌ మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు అంతర్జాతీయ స్థాయి సన్నాహక క్రికెట్‌ పోటీలు జరగనున్నాయని ఆంధ్ర క్రికెట్‌ నార్త్‌ జోన్‌ కార్యదర్శి జి.వి.సన్యాసి రాజు తెలిపారు. మంగళవారం ఆ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇండియా జట్టు అయిన బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవెన్‌, దక్షిణా ఫ్రికా జట్ల మధ్య మూడు రోజులపాటు అంతర్జాతీ య స్థాయి సన్నాహక క్రికెట్‌ పోటీలు జరగనున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు జరగనుండ డం ఇదే మొదటిసారని తెలిపారు. ఇండియా టీమ్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, దక్షిణాఫ్రికా జట్టుకు క్వింటన్‌ డీకాక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ఇప్పటికే మైదానాన్ని ఆటకు అనువుగా సిద్ధం చేశామన్నారు. క్రీడాభిమానులంతా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని తెలిపారు. ప్రవేశం ఉచితమన్నారు. ఈ మ్యాచ్‌లను చూసేందుకు ప్రతి రోజు 1,500 మంది వచ్చే అవకాశముందని చెప్పారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 200 మంది విద్యార్థుల కు ఒకరోజు మ్యాచ్‌ చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం మ్యాచ్‌ కు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో నార్త్‌ జోన్‌ అకాడమీ హెడ్‌ కోచ్‌ సి.డి.థామ్సన్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు పి.సీతారామరాజు, ఎఒ సి.జగదీష్‌నాయుడు పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD