విజయవాడలో మూడు విభాగాల్లో మారథాన్

Prajasakti

Prajasakti

Author 2019-11-10 12:40:01

img

విజయవాడ: విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో మారథాన్కా ర్యక్రమం జరిగింది. 5,10,21కె మూడు విభాగాల్లో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమంలో యువతి, యువకులు భారీగా పాల్గొన్నారు. మారథాన్ రన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెంజ్ సర్కిల్ నుంచి కంట్రోల్ రూమ్‌కు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. కాగా ఈ కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీఐడీ డీఐజి త్రివిక్రమ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో జరుతున్న మారథాన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మారధన్‌కి మంచి స్పందన వచ్చిందని, 'హెల్త్ ఫర్ ఆల్' అనే నినాదంతో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం చాలా అభినందనీయమన్నారు. పెద్ద సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారని ఇంతియాజ్ వ్యాఖ్యానించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN