విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక, తమిళనాడు

Prajasakti

Prajasakti

Author 2019-10-24 08:51:39

img

బెంగళూరు : ప్రతిష్టాత్మక విజరు హజారే ట్రోఫీ ఫైనల్లోకి కర్ణాటక, తమిళనాడు జట్లు ప్రవేశించాయి. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటక 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ 49.4 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని కర్ణాటక సునాయసంగా చేధించింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ 92, కేఎల్‌ రాహుల్‌ 88, మయాంక్‌ 47 పరుగులు చేయడంతో 40 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి.. 229 పరుగులు చేసి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. జస్ట్‌ క్రికెట్‌ అకాడమీ వేదికగా గుజరాత్‌, తమిళనాడు మధ్య జరిగిన మరో సైమీఫైనల్‌కు తొలుత వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. 40 ఓవర్లలో గుజరాత్‌ 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేయగా.. తమిళనాడు 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయం సాధించింది. శుక్రవారం(25న) చిన్నస్వామి స్టేడియం వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య విజరు హజారే ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD