విరాట్‌కూ సాధ్యం కాదు..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-09 06:17:34

img

  • రోహిత్‌ ఆటకు వీరూ ఫిదా

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో రోహిత్‌ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌కు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫిదా అయ్యాడు. అతడిలా ఆడడం విరాట్‌ కోహ్లీకి కూడా సాధ్యం కాదని కొనియాడాడు. ‘ఒక ఓవర్‌లో 3-4 సిక్సర్లు లేదా 45 బంతుల్లో 80 నుంచి 90 పరుగులు బాదడమనేది ఓ కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. అసలు కోహ్లీ కూడా ఇంత నిలకడగా.. ఇంత వేగంగా ఆడడం ఎప్పుడూ చూడలేదు. అప్పట్లో సచిన్‌ కూడా ఇంతే వేగంగా బ్యాటింగ్‌ చేసేవాడు. అంతేకాకుండా నాలాగా మీరెందుకు ఆడరు? అని మిగతా ఆటగాళ్లను ప్రశ్నించేవాడు. కానీ దేవుడనే వాడు ఒక్కడే ఉంటాడనే విషయం అతడికెప్పుడూ అర్థం కాదు’ అని వీరూ తెలిపాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD