విరాట్‌.. వరల్డ్‌ బెస్ట్‌ కెప్టెన్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-30 06:14:01

img

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీయే ఉత్తమ కెప్టెన్‌ అని జార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ కొనియాడాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో నదీమ్‌ అరంగేట్రం చేశాడు. ‘విరాట్‌ చేతుల మీదుగా టెస్టు క్యాప్‌ అందుకోవాలన్న నా చిరకాల స్వప్నం నెరవేరినందుకు సంతోషంగా ఉంది. నా దృష్టిలో ప్రపంచ క్రికెట్‌లో అతడే ఉత్తమ కెప్టెన్‌. ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నా ప్రదర్శన సంతృప్తిని ఇచ్చింది. దేశవాళీ క్రికెట్‌లోని అనుభవాన్నంతా ఉపయోగించి దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశా’ అని నదీమ్‌ చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD