విరాట్ కోహ్లి భావోద్వేగం..

Mana Telangana

Mana Telangana

Author 2019-11-06 02:53:48

img

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం 31వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతను భావోద్వేగంతో రాసిన లేఖను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌లో సరదాగా గడుపుతున్నాడు. ఇదే సమయంలో తమకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. కాగా, ఈ సందర్భంగా కోహ్లి రాసిన ఓ లేఖ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. నా క్రికెట్ ప్రయాణం, జీవితంలో నేర్చుకున్న పాఠాల గురించి పదిహేనేళ్ల కోహ్లికి వివరిస్తున్నా.

మంచిగా రాయడానికి ప్రయత్నించా, చదవి చెప్పండి ఏలా ఉందో అని కోహ్లి రాసిన లేఖ వైరల్‌గా మారింది. తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, దానికి ఎదురొడ్డి నిలబడేందుకు తాను పడ్డా కష్టాలు తదితర అంశాలను కోహ్లి లేఖలో వివరించాడు. ఇక, దూకుడు స్వభావాన్ని తగ్గించుకుని కూల్‌గా మారేందుకు తాను పడిన కష్టాలు, దీనికి సంబంధించిన కారణాలను లేఖ ద్వారా పంచుకున్నాడు. ఇక, సుదీర్ఘ కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడుదొడుకులను వివరించాడు. ఇక, ఈ లేఖకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. లక్షలాది మంది దీనికి లైక్ కొట్టారు.

Virat Kohli pens emotional letter to 15 year old

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD