విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-01 01:06:40

img

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్.. ప్రస్తుతం పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక, శ్రీలంకతో జరుగుతోన్న రెండో వన్డేలో సెంచరీతో తన ఖాతాలో 11వ వన్డే సెంచరీ వేసుకున్న బాబర్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా కెప్టెన్ ఈ ఫీట్‌ను అందుకోవడానికి 82 ఇన్నింగ్స్‌లు ఆడగా.. బాబర్ మాత్రం కేవలం 71 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో 64 ఇన్సింగ్స్‌ల్లోనే 11 సెంచరీలు కొట్టిన టాప్‌ స్పాట్‌లో ఉన్నాడు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా ఉండగా.. 65 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్‌గా మరో సౌతాఫ్రికా ప్లేయర్ డికాక్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కోహ్లీ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు కోహ్లీని వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు బాబర్ ఆజమ్.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN