విలేకరి ప్రశ్న…పాక్ కోచ్ సమాధానం…

Amaravatinews

Amaravatinews

Author 2019-09-28 12:12:30

img

Share this on WhatsApp

కరాచీ:ఇటీవలే పాకిస్థాన్ జట్టుకు ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా నియమితుడైన మిస్బా ఉల్‌ హక్‌ గురువారం శ్రీలంకతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు మీడియాతో ముచ్చటించగా ఓ విలేకరి కశ్మీర్‌ అంశంపై అడిగిన ప్రశ్నకు బాధ్యతాయుతంగా జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ఆ విలేకరి లేవనెత్తిన కశ్మీర్‌ అంశంతో మిస్బాను ఇరకాటంలో పెట్టాలని చూశాడు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత టీమిండియా ఆటగాళ్లు భారత ఆర్మీ క్యాప్‌లను ధరించి క్రికెట్‌ ఆడినట్లుగా కశ్మీర్‌ పరిస్థితులపై పాక్‌ జట్టు ఎలా స్పందించనుందని అడిగాడు. అందుకు మిస్బా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ మొత్తం విచారం వ్యక్తం చేస్తోందని, ఇక్కడ క్రికెట్‌కు సంబంధించిన విషయాలపైనే మాట్లాడదామని స్పష్టంచేశాడు.

అలాగే మిస్బాకు ఒకేసారి రెండు పదవులు రావడంపై అడిగిన ప్రశ్నకు తానేమీ మాయలు చేయలేదని చెప్పాడు. తనకు వచ్చే జీతం కూడా ఇంత ఇవ్వాలని పాక్‌ బోర్డుని డిమాండ్‌ చేయలేదని, గత కోచ్‌కి ఎంత ఇచ్చేవారో అదే ఇవ్వమని చెప్పానని మిస్బా పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం పాకిస్థాన్‌ X శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ సోమవారానికి వాయిదా పడింది. రెండో వన్డేకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందనే సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక తొలి వన్డేకు టికెట్లు కొన్న అభిమానులు రెండో వన్డేకు రావొచ్చని అక్కడి అధికారులు వెల్లడించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN