వివాదాన్ని మరిచి..వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచి..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-30 06:30:55

img

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

క్రిస్టియన్‌ కోల్‌మన్‌..100 మీటర్లలో సరికొత్త వరల్డ్‌ చాంపియన్‌. ప్రపంచ అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీ. రేస్‌ను అమెరికన్‌ స్టార్‌ కోల్‌మన్‌ 9.76 సె.తో పూర్తి చేసిన స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. అమెరికాకే చెందిన జస్టిన్‌ గాట్లిన్‌ (9.89 సె.) రజతం, కెనడా అథ్లెట్‌ ఆండ్రీ డీ గ్రాస్‌ (9.90 సె.) కాంస్య పతకం గెలిచారు. ఈ మెగా ఈవెంట్‌లో కోల్‌మన్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా..డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘన కేసు అతడిని చట్టుముట్టింది. సాంకేతిక కారణాలతో అమెరికా స్ర్పింటర్‌ ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఆ వివాదం చాయలు దరిచేరనీయకుండా అతడు అమోఘ ప్రదర్శన చేయడం విశేషం.

ఆ వివాదం ఏమిటి ?

ప్రపంచ టాప్‌ అథ్లెట్లందరికీ ప్రతి మేజర్‌ చాంపియన్‌షిప్‌లతో పాటు టోర్నీలు లేనప్పుడు కూడా డోప్‌ టెస్ట్‌లు జరుపుతారు. అమెరికా ట్రాక్‌, ఫీల్డ్‌ అథ్లెట్లంతా..యూఎస్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (యూఎ్‌సఏడీఏ) ‘రిజిస్టర్డ్‌ టెస్ట్‌ పూలింగ్‌ (ఆర్టీపీ)లో నమోదవుతారు. ఈ అథ్లెట్లంతా..ప్రతీ త్రైమాసికంలో ప్రతిరోజు తాము ఎక్కడ ఉంటామన్న పూర్తి వివరాలను ఆ త్రైమాసికం ఆరంభంలో యూఎ్‌సఏడీఏకి తెలియజేయాలి. మరీముఖ్యంగా..ఆ త్రైమాసికంలో డోప్‌ టెస్ట్‌ కోసం ప్రతి రోజూ ఒక గంట ఏ సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉంటామన్నది కూడా స్పష్టంగా పేర్కొనాలి. కానీ వారు పేర్కొన్న గంట సమయంలో కాకుండా ఏదో ఒక సమయంలోనైనా యూఎ్‌సఏడీఏ అథ్లెట్లకు డోప్‌ పరీక్షలు చేయవచ్చు.

తప్పిదాలు ఇలా..

అథ్లెట్లకు డ్రగ్‌ పరీక్షల నిర్వహణలో రెండు రకాల తప్పిదాలు జరుగుతాయి. ఒకటి.. తాను తెలిపిన గంట సమయంలో డోపింగ్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌ (డీసీఓ)కి సదరు అథ్లెట్‌ అందుబాటులో లేకపోవడం. దీనిని ‘మిస్డ్‌ టెస్ట్‌’ అంటారు. ఇక రెండోది..అథ్లెట్‌ అందుబాటులో ఉంటానని ప్రకటించిన గంటలో కాకుండా మరో సమయంలో డ్రగ్‌ టెస్ట్‌కు డీసీఓ యత్నించడాన్ని ‘ఫైలింగ్‌ ఫెయిల్యూర్‌’ అంటారు. రోజువారీగా తాము ఎక్కడ ఉంటామో తెలియజేసిన మేరకు అథ్లెట్‌ ఆ ప్రదేశంలో లేకపోతే..ఆ అథ్లెట్‌ అందుబాటులో లేనట్టు పరిగణిస్తారు. ఇక..అథ్లెట్‌ ప్రకటించిన వివరాల్లో తప్పులు ఉన్నా, పూర్తి వివరాలు లేకున్నా దానిని ‘ఫైలింగ్‌ ఫెయిల్యూర్‌’గా భావిస్తారు. ఒక ఏడాదిలో మూడుసార్లు డీసీఓకి అందుబాటులో ఉండడంలో విఫలమైతే ఆ అథ్లెట్‌పై నిషేధాన్ని విధిస్తారు.

కోల్‌మన్‌ తప్పిదం ఏమిటి ?

కోల్‌మన్‌ మూడుసార్లు డోప్‌ టెస్ట్‌లకు అందుబాటులో లేడంటూ యూఎ్‌సఏడీఏ పేర్కొన్న తేదీలు..అంతర్జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ పేర్కొన్న ‘త్రైమాసిక’ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడంతో అతడిని నిర్దోషిగా ప్రకటించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD