విశాఖలో టీమిండియా ప్లేయర్లు

Newwaves

Newwaves

Author 2019-09-30 10:13:00

img

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో పాల్గొనేందుకు టీమిండియా ప్లేయర్లు విశాఖపట్నం చేరుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం మధ్యాహ్నానికే వైజాగ్ వచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి వారు ప్రత్యేక వాహనంలో తాము బస చేసే హొటల్‌కు చేరుకున్నారు. వృద్దిమాన్ సాహ, కుల్‌దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వేర్వేరు విమానాల్లో విశాఖ వచ్చారు. సౌతాఫ్రికా, భారత జట్లు సోమ, మంగళవారాల్లో నెట్ ప్రాక్టీస్ చేస్తాయి.

సంవత్సరానికి పైగా విరామం అనంతరం సొంతగడ్డపై టీమిండియా టెస్ట్ పోటీకి రెడీ అవుతోంది. టెస్టు జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ళు విజయనగరంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు కొన్ని రోజుల ముందరే వచ్చారు. విజయనగరం మ్యాచ్ ముగిసిన తర్వాత వారు విశాఖ చేరుకున్నారు.

కాగా.. ఏసీఏ- వీడీసీఏ మైదానంలో ఇంత వరకూ ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ జరిగింది. 2016లో జరిగిన ఆ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుపై టీమిండియా 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియాకు ఈ స్టేడియంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా మంచి రికార్డే ఉంది. అచ్చు వచ్చిన ఈ స్టేడియంలో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టును ఓడించి మూడు టెస్టుల ఈ సీరీస్‌ను శుభారంభం చేయాలని టీమిండియా ఉవ్విళ్ళూరుతోంది. సొంత గడ్డపై సౌతాఫ్రికాతో 16 టెస్టులు ఆడిన భారత్ 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN