విశాఖ చేరుకున్న విరాట్
విశాఖపట్నం (స్పోర్ట్స్): ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో తలపడనున్న భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నాడు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో హోటల్‌కు చేరాడు. ఇక, వృద్ధిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ వేర్వేరు విమానాల్లో విశాఖ చేరారు. ఇరు దేశాల ఆటగాళ్లు సోమ, మంగళవారాల్లో నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు.