విశాఖ టెస్టులో సఫారీల ఎదురుదాడి

Teluguglobal

Teluguglobal

Author 2019-10-05 14:05:45

img

  • ఎల్గర్, డీ కాక్ సెంచరీలతో దీటైన బ్యాటింగ్

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆటలో..సౌతాఫ్రికా దీటైన బ్యాటింగ్ తో బదులిచ్చింది. విశాఖ ఆంధ్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ భారీ తొలిఇన్నింగ్స్ స్కోరు 502 పరుగులకు బదులుగా సఫారీటీమ్ 8 వికెట్లకు 385 పరుగుల స్కోరుతో శుక్రవారం ఆటను ముగించింది.

ఎల్గర్ ఫైటింగ్ సెంచరీ…

imgఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా కు ఓపెనర్ ఎల్గర్ తో కలసి కెప్టెన్ ఫాబ్ డూప్లెసీ కీలక భాగస్వామ్యం నమోదు చేసి అవుటయ్యాడు.ఆ తర్వాత మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీ కాక్ తో సైతం కలసి ఎల్గర్ మరో భాగస్వామ్యం సాధించాడు.

img

ఎల్గర్ మొత్తం 287 బాల్స్ ఎదుర్కొని 18 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 160 పరుగుల స్కోరు సాధించాడు. ఎల్గర్ కెరియర్ లో ఇది 12వ శతకం కాగా…భారత గడ్డపై సాధించిన తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం.

డీ కాక్ ధూమ్ ధామ్ శతకం…

img

కెప్టెన్ డూప్లెసీ అవుట్ కావడంతో బ్యాటింగ్ కు దిగిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీ కాక్ కేవలం 163 బాల్స్ లోనే 16 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 111 పరుగులతో తన జట్టును ఆదుకొన్నాడు. డి కాక్ టెస్ట్ కెరియర్ లో ఇది ఐదో శతకం మాత్రమే. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, జడేజా 2 వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

img

భారత్ కంటే సౌతాఫ్రికా ఇంకా 117 పరుగుల స్కోరుతో వెనుకబడి ఉంది. టెస్ట్ ముగియటానికి చివరి రెండురోజుల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో.. ఏదైనా అద్బుతం జరిగితే మినహా…మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD