విశాఖ టెస్ట్: టీమిండియా 324/1

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-03 14:46:55

img

విశాఖ టెస్ట్‌పై క్రమంగా పట్టుబిగిస్తోంది టీమిండియా.. వర్షం కారణంగా నిన్న 202 పరుగుల దగ్గరే మ్యాచ్ నిలిచిపోగా.. నిన్న అదరగొట్టిన రోహిత్ శర్మ-మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ జోడీ.. ఈ రోజు మరింత వేగంగా పరుగులు రాబట్టింది.. నిన్న 115 పరుగుల దగ్గర రోహిత్ ఇన్నింగ్స్ నిలిచిపోగా.. ఇవాళ 176 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయినట్టైంది. ఇక.. మరో ఓపెనర్ మయాంక్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు... నిన్న 84 పరుగులు చేసిన మయాంక్.. ఇవాళ లంచ్ సమయానికి 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. మొత్తానికి ఓపెనింగ్ జోడీ 300కు పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. రోహిత్ ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన పుజారా.. లంచ్ సమయానికి 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN