విశాఖ టెస్ట్ : విజయానికి 9 వికెట్ల దూరంలో టీమిండియా

10 TV News Channel

10 TV News Channel

Author 2019-10-06 08:36:32

img

విశాఖ టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పుజారా ఫోర్లు... రోహిత్ డబుల్ మోతతో బ్యాట్‌మెన్ హవా కొనసాగింది. 4 వికెట్లకు 323 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి సౌతాఫ్రికా 11 పరుగులు చేసింది.

విశాఖ టెస్ట్‌లో విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది టీమిండియా.. నాలుగో రోజు... భారత బ్యాట్స్‌మెన్ హవా కొనసాగింది. ఓపెనర్ రోహిత్ శర్మ రెండో సెంచరీతో చెలరేగితే... హాఫ్‌తో పుజారా మెరిసాడు. 149 బంతులాడిన రోహిత్ శర్మ... ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 ఫోర్లు, 7 సిక్సులతో 127 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో 81 పరుగులతో పుజారా మెరవడంతో భారీ స్కోర్ చేసింది జట్టు. కోహ్లీ, రహానే కూడా వేగంగా ఆడటంతో... సౌతాఫ్రికా ముందు భారత్ 395 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

396 టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ఎల్గర్‌ను జడేజా 2 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 11/1 స్కోరుతో నిలిచింది. అంతకు ముందు.. 8 వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్‌ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా... మరో 73 పరుగులు మాత్రమే జోడించగలిగింది. ముత్తుస్వామి 33 పరుగులు చేయడంతో... డుప్లెసిస్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ 7 వికెట్లు తీసి.. సఫారీలను దెబ్బతీయడంతో భారత్‌కు 91 పరుగుల ఆధిక్యం లభించింది.   

91 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులు చేసిన మయాంక్‌ను మహారాజ్ బోల్తా కొట్టించడంతో 21 పరుగులకే కోహ్లీసేన తొలి వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలసి బౌండరీలతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. పుజారాను ఫిలాండర్‌ పెవిలియన్‌కు పంపించడంతో 169 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది

ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ... ఈ మ్యాచ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. విశాఖ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్... రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ వరల్డ్ రికార్డ్ సాధించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN